'న్యూమోనియా వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలి'
SRPT: న్యూమోనియాతో అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా చలికాలంలో వైద్యుల సలహాలు పాటించాలని పల్మనాలజిస్టు డాక్టర్ రాజీవ్ తెలిపారు. ప్రపంచ న్యుమోనియా డే సందర్భంగా ఈరోజు ఆయన ప్రజలకు పలు సూచనలు చేశారు. న్యూమోనియా అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్ అని అన్నారు. ఈ లక్షణాల్లో ముఖ్యంగా జలుబు, దగ్గు మొదలగు లక్షణాల ద్వారా గుర్తించవచ్చని అన్నారు.