నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్  సరఫరాలో అంతరాయం

VZM: భోగాపురం మండలంలోని ఏ. రాయివలస 11KV రూరల్‌ ఫీడర్‌ పరిధిలో విద్యుత్‌ మరమ్మతుల కారణంగా శుక్రవారం విద్యుత్‌కు అంతరాయం కలుగుతుందని విద్యుత్‌ శాఖ రూరల్‌ EE జి. సురేశ్‌ బాబు గురువారం తెలిపారు. ఈ మేరకు ఉదయం 9 నుంచి 2 వరకు గూడెపువలస, దల్లి పెట, రెడ్డి కంచేరు, బైరెడ్డిపాలెం, ముగడపీట, ఆర్‌ &ఆర్‌ కాలనీ, గ్రామాలలో విద్యుత్‌ అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు.