మద్యం తాగి వాహనాలు నడపొద్దు: సీఐ

మద్యం తాగి వాహనాలు నడపొద్దు: సీఐ

SRPT: 'అరైవ్ అలైవ్' కార్యక్రమంలో భాగంగా ఆదివారం సూర్యాపేట పట్టణంలో కొత్త బస్టాండ్ వద్ద మద్యం తాగి వాహనాలు నడపడంపై ఈరోజు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ వెంకట్ మాట్లాడుతూ.. ప్రాణాలు విలువైనవని, మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడొద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సాయిరాం, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.