మీ బండిలో ఇంజన్ ఆయిల్ పోయిస్తున్నారా..? జాగ్రత్త..!
HYD: నకిలీ ఇంజన్ ఆయిల్ దందా రోజురోజుకు పెరుగుతోంది. ఉప్పల్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో అనుమానం వచ్చిన కొంత మంది ఆరా తీయడంతో గుట్టు బయటపడింది. నకిలీ ఇంజన్ ఆయిల్ కారణంగా బండిలో శబ్దం వస్తున్నట్లు వారు తెలిపారు. నకిలీ ఇంజన్ ఆయిల్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, నమ్మకస్తుల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.