ఈనెల 27, 28న రాష్ట్రస్థాయి ఎంపికలు

ఈనెల 27, 28న రాష్ట్రస్థాయి ఎంపికలు

SRD: క్రీడా పాఠశాలల్లో 4వ తరగతి ప్రవేశం కోసం ఈనెల 27, 28న హకీంపేటలో రాష్ట్రస్థాయి ఎంపికలు జరుగనున్నాయి. జిల్లాస్థాయిలో ఎంపికైన క్రీడాకారులు ఆధార్, పుట్టిన తేదీ ధ్రువీకరణ, బోనాఫైడ్, కుల ధ్రువీకరణ పత్రాలు, 5 ఫోటోలతో హాజరుకావాలని డీఎస్‌డీఓ అఖిలేష్ రెడ్డి సూచించారు.