'మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు'

'మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు'

ASR: అరకులోయ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అరకు సీఐ హిమగిరి హెచ్చరించారు. తాగి డ్రైవింగ్‌ చేస్తూ పట్టుబడితే సంబంధిత వాహనాలను సీజ్ చేయడంతో పాటు రూ.10వేల వరకు జరిమానా విధించడమే కాకుండా జైలు శిక్ష కూడా ఉంటుందని స్పష్టం చేశారు. పొగమంచు కారణంగా ఘాటిలో వరుసగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.