వడ్డాడి సర్పంచ్‌గా బెండె జయసుధ విజయం
ADB: తాంసి మండల పరిధిలోని 11 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. మండలంలోని వడ్డాడి సర్పంచ్‌గా బెండె జయసుధ విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి బాగిడి లక్ష్మిపై 140 ఓట్ల తేడాతో గెలుపొందారు. మండలంలో మొత్తం 14 గ్రామ పంచాయతీలు ఉండగా.. ఇందులో 3 గ్రామ పంచాయతీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.