నేడు నగరంలో సైన్యానికి సంఘీ భావంగా ర్యాలీ

HYD: భారత సైన్యానికి సంఘీభావంగా ఆపరేషన్ సింధూర్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు గురువారం హైదరాబాదులో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్డు వరకు ఈ ర్యాలీ కొనసాగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే తీసుకోవాల్సిన చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధికారులతో చర్చలు జరిపారు.