ఉచిత కంటి వైద్య పరీక్షలు

KMR: సదాశివనగర్ PHCలో బుదవారం కంటి వైద్య శిబిరం నిర్వహించినట్లు ఆప్తాల్మిక్ ఆఫీసర్ హరికిషన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. కంటి సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేసినట్లు వెల్లడించారు. చూపు మందగించిన వ్యక్తులు అద్దాలు వాడాలని సూచించారు. కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదని తెలిపారు.