'లవ్ ఆల్ - సర్వ్ ఆల్' స్ఫూర్తితో రక్తదానం
SKLM: భగవాన్ శ్రీ సత్య సాయి బాబా శతజయంతి ఉత్సవాలలో భాగంగా ఇవాళ కాశీబుగ్గలోని ప్రశాంతి సాయి ట్రస్ట్ పూర్వ, ప్రస్తుత విద్యార్థులు రక్తదానం చేశారు. 'లవ్ ఆల్ - సర్వ్ ఆల్' అనే స్వామివారి సందేశ స్ఫూర్తితో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు. నవంబర్ 23న జరిగే జయంతి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి దివ్య ప్రసాదం స్వీకరించాలని కోరారు.