రోజు రోజుకు పెరుగుతున్న చలి తీవ్రత.!

రోజు రోజుకు  పెరుగుతున్న చలి తీవ్రత.!

NGKL: కోడేరు మండలం పరిధిలోని పలు గ్రామాల్లో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. చలికి తోడు భారీ పొగ మంచు ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం, రాత్రి వేళల్లో అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని.. ఉన్ని దుస్తులు ధరించాలని, పిల్లలు, వృద్ధులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.