'గురుకుల పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి'
PDPL: గురుకుల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మంథనిలోని గురుకులం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ.. హాస్టల్‌లో అందించే భోజనం నాణ్యత పెంచాలని, విద్యార్థులకు రుచికరంగా వంటలు చేయించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.