విశాఖ–బెంగళూరు ప్రత్యేక రైళ్లు
VSP: ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈస్ట్ కోస్ట్ రైల్వే విశాఖపట్నం–బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ నెల 15న విశాఖ నుంచి మధ్యాహ్నం 3:20కి బయలుదేరి, మరుసటి రోజు 12:45కు బెంగళూరుకు చేరుతుంది. తిరుగు రైలు 16న బెంగళూరు నుంచి 3:50కు బయలుదేరి, 17న 1:30కు విశాఖ చేరుకుంటుంది.