ఈనెల 26 నుంచి నరసింహకొండ వార్షిక బ్రహ్మోత్సవాలు
NLR: నెల్లూరు రూరల్ మండలం నరసింహకొండ శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 26 నుంచి మే ఆరవ తేదీ వరకు నిర్వహించనున్నారు. బుధవారం నరసింహకొండ దేవస్థానములో బ్రహ్మోత్సవాలు ఏర్పాటుపై అధికారులు సిబ్బంది సమీక్ష చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో అనూష పాల్గొన్నారు.