VIDEO: జేఎన్‌టీయూ గెస్ట్ లెక్చరర్‌పై దాడి
MHBD: పట్టణంలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ) కళాశాల గెస్ట్ లెక్చరర్ నీరటి ఉదయ్ కుమార్‌పై శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఇద్దరు ద్విచక్రవాహనంపై వచ్చి, మరొకరితో కలిసి ఇంట్లోకి తీసుకెళ్లి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన సమయంలో ఆయన భార్య, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.