కేంద్ర విద్యాలయం విద్యార్థికి బంగారు పతకం

కేంద్ర విద్యాలయం విద్యార్థికి బంగారు పతకం

కడప: హైదరాబాదుకు సమీపంలోని గోల్కొండలో గత నెల 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నిర్వహించిన అథ్లెటిక్స్ క్రీడా పోటీలలో డిస్కస్ త్రోలో రాజంపేట కేంద్రీయ విద్యాలయం 10వ తరగతి విద్యార్థి ఎస్.ఉదయ శంకర్‌కు బంగారు పతకం లభించింది. ఈ సందర్భంగా ఆ విద్యాలయం ప్రిన్సిపాల్ డాక్టర్ కె. మురుగేశ్వరన్, వ్యాయామ ఉపాధ్యాయుడు రాహుల్ విద్యార్థి ఉదయ్ శంకర్‌ను అభినందించారు.