రేపు ప్రభుత్వ ఐటిఐ లో ఉద్యోగ మేళా
SKLM: శ్రీకాకుళంలోని బలగ ప్రభుత్వ ఐటీఐలో శనివారం ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖాధికారి కె. సుధ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఉ. 10 గంటలకు హాజరుకావాలని అన్నారు.వివిధ సంస్థల్లో 345 ఉద్యో గాలను భర్తీ చేయనున్నట్లు , ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పూర్తయిన అభ్యర్థులు అర్హులని తెలిపారు.