అనంత జిల్లాలో ఎన్నికల రిటర్నింగ్ అధికారుల నియామకం

అనంతపురం: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆర్వోలను నియమించారు. అనంత పార్లమెంట్ నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారిగా కలెక్టర్ వినోద్ కుమార్ వ్యవహరించనున్నారు. ఉరవకొండ ఆర్వోగా కేతన్ గార్గ్, రాయదుర్గం ఆర్వోగా కరుణకుమారి, గుంతకల్లు ఆర్వోగా శ్రీనివాసులు రెడ్డి, శింగనమల ఆర్వోగా వెన్నెల శ్రీను, అనంతపురం ఆర్వోగా వెంకటేష్ లను నియమించారు.