'గ్రామీణ వికాసం బీజేపీతోనే సాధ్యం'

JGL: కథలాపూర్ మండల కేంద్రంతో పాటు 18 గ్రామాల్లో సోమవారం రోజున బీజేపీ బూత్ అధ్యక్షులు బూత్‌లలో ఇంటింటికీ తిరుగుతూ.. గ్రామస్తులకు కరపత్రాలు అందించారు. గ్రామీణ వికాసం బీజేపీతోనే సాధ్యమన్నారు. బీఆర్ఎస్ నియంతృత్వ పాలనకు కొనసాగింపుగా ప్రస్తుత ప్రభుత్వ తీరు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మారుతి, శ్రీనివాస్, మహేష్, ప్రసాద్, ప్రమోద్, రాజు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.