కాశిబుగ్గలో బాటసారులకు రాగిజావ పంపిణీ
వరంగల్ నగరంలోని కాశీబుగ్గ సెంటర్ వద్ద సోమవారం బాటసారులకు రాగి జావను పంపిణీ చేశారు. నేడు తమ పెళ్లిరోజు సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు నాగుల యుగేందర్ దంపతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భద్రకాళి ఆలయ మాజీ ధర్మకర్త సాంబారి మల్లేశం, వంగరీ పరపతి సంఘం అధ్యక్షులు వంగరి జయప్రకాష్, కోశాధికారి వంగరి రవి, గుండు సత్యనారాయణ, చింతం జగదీశ్వర్, తదితరులున్నారు.