నేడు పద్మావతి అమ్మవారి గరుడ సేవ
AP: తిరుపతిలోని శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ ప్రధాన ఘట్టం అయిన గరుడ సేవ జరగనుంది. ఉ.8 గంటలకు సర్వభూపాల వాహనం, 10.30కి పాదాలు పసుపు మండపం ఊరేగింపు ఉంటుంది. సా.4.20 గంటలకు స్వర్ణ రథం సేవ ఉంటుంది. రా.7 గంటలకు అత్యంత ముఖ్యమైన గరుడ సేవ ప్రారంభమవుతుంది. గరుడ సేవ సందర్భంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.