కియా పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
సత్యసాయి: పెనుకొండ సబ్‌డివిజన్ పరిధిలోని కియా పోలీస్ స్టేషన్‌ను బుధవారం జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ బుధవారం తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్, లాకప్ గది, కంప్యూటర్ గదులు, పరిసరాలను ఎస్పీ పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ.. మహిళల నుంచి వచ్చే ఫిర్యాదులను అత్యంత ప్రాధాన్యతతో స్వీకరించి వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.