'వంతెనకు శాశ్వత పరిష్కారం చూపండి'

W.G: కామవరపుకోట మండలం ఆడమిల్లి వద్ద ఉన్న వంతెన కుంగింది. దీంతో రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. ఎప్పటి నుంచో ఈ చిన్న వంతెనపై నుంచి ఏలూరు, జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు ప్రయాణిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వంతెన కుంగి ప్రమాదకరంగా ఉంది. అధికారులు స్పందించి కుంగిన వంతెనను పరిశీలించి దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.