VIDEO: భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నకేంద్ర మంత్రి
WGL: భద్రకాళి అమ్మవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు కేంద్ర మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆయన ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు కిషన్ రెడ్డికి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం HNK వేయి స్తంభాల గుడి ఆలయంలో రుద్రేశ్వర స్వామి దర్శనానికి వెళ్లి పునర్నిర్మాణ పనులను పరిశీలిస్తారు.