భారత క్రికెటర్ శ్రీచరణికి టీటీడీ ఛైర్మన్ అభినందనలు
TPT: ఇటీవల జరిగిన మహిళా క్రికెట్ వరల్డ్ కప్లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన కడప జిల్లాకు చెందిన భారత మహిళా క్రికెటర్ శ్రీచరణిని టీటీడీ ఛైర్మన్ బీ. ఆర్. నాయుడు అభినందించారు. శనివారం తిరుమలలోని క్యాంప్ కార్యాలయంలో శ్రీచరణి టీటీడీ చైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఛైర్మన్ ఆమెను శాలువతో సత్కరించి, శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.