లారీ కింద బైకు.. వ్యక్తికి గాయాలు
GDWL: గద్వాల పట్టణంలోని కృష్ణవేణి చౌరస్తా వద్ద శుక్రవారం ప్రమాదవశాత్తు ఒక లారీ కింద బైక్ పడటంతో ద్విచక్ర వాహనదారుడికి కాలు దగ్గర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.