ఒకే వార్డులో ఐదు ఓట్లు!
NRPT: మక్తల్ మండలం మంథన్ గోడు గ్రామ సర్పంచ్ ఎన్నికల ఓటర్ల లిస్టులో ఒకే యువతికి 3159 నుండి 3163 వరకు వరుసగా ఐదు ఓట్లు, ఒకే ఫొటోతో నమోదయ్యాయి. ఒకే వార్డులో, ఒకే వ్యక్తికి ఐదుసార్లు ఓటు వేసే అవకాశం కల్పించడం అధికారుల నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తోంది. ఓటర్ లిస్టు సవరణలో, దొంగ ఓట్లను అరికట్టడంలో బీఎల్‌వోలు, ఎన్నికల అధికారులు విఫలమయ్యారని స్థానికులు మండిపడుతున్నారు.