ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు
NZB: 58వ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకలు నిన్న జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్‌లో ఘనంగా జరిగాయి. సంస్థ ఛైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్ హాజరయ్యారు. వారం రోజులు జరిగిన పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు.