ధాన్యం కొనుగోళ్ల కోసం కంట్రోల్ రూమ్
KMR: జిల్లాలో ధాన్యం సేకరణకు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు జిల్లా మేనేజర్, పౌర సరఫరాల సంస్థ కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్‌ను జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ బుధవారం ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు ఎదురైతే రైతులు 08468-220051 నంబర్‌కు ఫోన్ చేయాలని చెప్పారు.