అనకాపల్లిలో వైసీపీ నాయకులు నిరసన

అనకాపల్లిలో వైసీపీ నాయకులు నిరసన

అనకాపల్లి: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అనకాపల్లిలో బుధవారం వైసీపీ నాయకులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ సత్యవతి మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను తీసుకువస్తే కూటమి ప్రభుత్వం ఈ కళాశాలలను ప్రైవేటుకు అప్పగించేందుకు పూనుకుందన్నారు. తక్షణమే నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు.