భవన నిర్మాణ కార్మికులకు కలెక్టర్ శుభవార్త
కడప: జిల్లాలోని భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులకు కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి శుభవార్త చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు ప్రసూతి సహాయం, వివాహ కానుక, అంత్యక్రియల ఖర్చులు, సహజ మరణ ఆర్థిక సాయం అనే నాలుగు పథకాలను ప్రభుత్వం పునరుద్ధరించిందని తెలిపారు. 01-05-2026 నుంచి ఇవి వెంటనే అమల్లోకి వస్తాయని ఆయన వివరించారు. అర్హులైన కార్మికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.