భీంగల్ మండలంలో స్వల్ప భూకంపం

NZB: భీమగల్ పట్టణతో పాటు మండలంలోని సోమవారం సాయంత్రం 6: 45 గంటలకు స్వల్ప భూకంపం వచ్చింది. సాయంత్రం భూకంపం రావడంతో ఇండ్లలోంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. భూకంపం రావడంతో ఇండ్లలోకి వెళ్లేందుకు జనం భయపడ్డారు. స్వల్పంగా భూమి కంపించి ఆగిపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇండ్లలోంచి బయటకు వచ్చిన జనాలు భూకంపం గురించి చర్చించుకున్నారు.