దాడులు.. 65 మంది మృతి

దాడులు.. 65 మంది మృతి

గాజా నగరంపై దాడులను ఇజ్రాయెల్ కొనసాగిస్తూనే ఉంది. తాజాగా నగరంలోని పలు ప్రాంతాలపై జరిపిన దాడుల్లో 65 మంది మృతి చెందారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన 14 మంది ఉన్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడినట్లు తెలిపాయి. ఈ దాడులను ఖండించిన హమాన్.. పౌరులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఇజ్రాయెల్ యుద్ధ నేరాలకు పాల్పడుతోందని ఆరోపించింది.