ప్రాతఃకాల దర్శనంలో భద్రకాళి అమ్మవారు

WGL: శ్రీ భద్రకాళి దేవస్థానంలో జరుగుతున్న భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు మంగళవారం ఆలయ అర్చకులు ఉదయం అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. ప్రాతఃకాల విశేష దర్శనంలో భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.