చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

CTR: చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు చిత్తూరు జిల్లా పెద్దపంజాణి ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. అనుమానస్పదంగా చెన్నారెడ్డిపల్లి క్రాస్ వద్ద ఉన్న గోవర్ధన్ అనే వ్యక్తిని అరెస్టు చేసి, 146 గ్రాముల బంగారు నగలు, 200 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. వ్యక్తిని తిరుపతిలోని జువైనల్ హోమ్‌కు తరలించడం జరిగిందన్నారు.