VIDEO: కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే
HNK: హసన్ పర్తి మండల కేంద్రంలో టీటీఎస్ సెంటర్‌లో నూతన ప్రోహిబిషన్ & ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌ను సోమవారం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం సీఐ దుర్గాభవానిను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. డ్రగ్స్, గంజాయి, అక్రమ మద్యం నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.