కూలిన చెట్టు.. రాకపోకలకు అంతరాయం

MHBD: నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి మహబూబాబాద్ జిల్లాలోని గంగారం మండలం నుంచి కొత్తగూడాకు వెళ్లే మార్గంలో ఓ భారీ చెట్టు శనివారం ఉదయం నేలకులింది. దీంతో ఇరు గ్రామస్తులకు, వ్యాపారల నిమిత్తం వెళ్లే బాటసారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపడుతున్నారు.