ట్రాక్టర్‌ను ఢీకొట్టిన బైక్.. ఇద్దరు మృతి

ట్రాక్టర్‌ను ఢీకొట్టిన బైక్.. ఇద్దరు మృతి

పల్నాడు: జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. వెల్దుర్తిలోని పెట్రోల్ బంక్ సెంటర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బైక్ ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ప్రమాదంలో 30 ఏళ్ల వ్యక్తి, మూడేళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ బ్రేక్ వేయడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.