రామప్ప ఆలయాన్ని సందర్శించిన ఇటలీ దేశస్తులు

రామప్ప ఆలయాన్ని సందర్శించిన ఇటలీ దేశస్తులు

MLG: యూనిస్కో గుర్తింపు పొందిన పాలంపేటలోని రామప్ప ఆలయాన్ని ఆదివారం సాయంత్రం ఇటలీ దేశస్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి ఘన స్వాగతం పలికి వారి చేత ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ గైడ్ విజయ్ కుమార్ రామప్ప చరిత్ర, శిల్ప సంపదను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.