ఓరుగల్లులో ఒకే రోజు పర్యటన.. వేడెక్కిన రాజకీయం

WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒకేరోజు కేసీఆర్ కుమారుడు, కుమార్తె వేర్వేరు కార్యక్రమాల్లో పర్యటించడంపై ఓరుగల్లులో రాజకీయం వేడెక్కింది. ఆదివారం కేటీఆర్ BDPL, పరకాల నియోజకవర్గంలో పర్యటించగా, కవిత నర్సంపేట, పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో పర్యటించారు. వీరిద్దరి పర్యటన యాదృచ్ఛికంగా జరిగిందా లేదా కావాలని పోటాపోటీగా అన్నాచెల్లెలు వరంగల్‌కు వచ్చారా? అని చర్చ జరుగుతోంది.