అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

AKP: కశింకోట మండలం తాళ్లపాలెంలో పలు అభివృద్ధి పనులను అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ గురువారం ప్రారంభించారు. రూ.50 లక్షలతో నిర్మించిన బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్, ఎనిమిది లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, మరో 8 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు ప్లాట్ ఫాం, సంతలో వ్యాపారులకు నిర్మించిన షెడ్లను ప్రారంభించారు.