IND vs SA: వికెట్ తీసిన 'బర్త్ డే బాయ్'

IND vs SA: వికెట్ తీసిన 'బర్త్ డే బాయ్'

విశాఖ వన్డేలో 'బర్త్ డే బాయ్' రవీంద్ర జడేజా(36 ఏళ్లు) తొలి వికెట్ తీసుకున్నాడు. హాఫ్ సెంచరీ వైపు సాగుతున్న సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమాను 48 పరుగుల వద్ద ఔట్ చేశాడు. బావుమా కొట్టిన షాట్‌ను బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ క్యాచ్ అందుకున్నాడు. కాగా, జడేజాకు ఈ సిరీస్‌లో ఇదే తొలి వికెట్ కావడం గమనార్హం.