కదిరిలో చోరీకి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్

కదిరిలో చోరీకి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్

సత్యసాయి: కదిరిలో రాత్రి వేళ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని బుధవారం కదిరి పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.9,70,000 నగదు, 2 తులాల బంగారు చైన్ రికవరీ చేశారు. అనంతరం కదిరి సీఐ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. గత నెల 17న రాత్రి 10 గంటల నుంచి 11 గంటల మధ్య బట్టల దుకాణం వ్యాపారి బాబా ఫక్రుద్దీన్ ఇంట్లో సాబీర్ దొంగతనం చేసినట్లు తెలిపారు.