జమ్మిచేడు జమ్ములమ్మ అమ్మవారి విశేష రూపం

GDWL: శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్భంగా జమ్మిచేడులో వెలసిన శ్రీ జమ్ములమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నది జలాలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. అమ్మవారి దర్శనం కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.