రోడ్డుపై అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
ELR: వ్యక్తి మద్యం తాగి రోడ్డు పక్కనే మృతి చెందిన ఘటన మాదేపల్లి గంగానమ్మ గుడి వద్ద జరిగింది. ఏలూరు రూరల్ మండలం పెనుమాక లంకకు చెందిన వెంకన్న(47) కూలి పనులు చేస్తూ, వచ్చిన డబ్బుతో మద్యం తాగి రోడ్డు పక్కనే నిద్రించే వాడు. ఈ క్రమంలోనే శనివారం రోడ్డు పక్కన వెంకన్న అనుమానాస్పదంగా మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి వివరాలు సేకరిస్తున్నారు.