జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ పోస్టుకు దరఖాస్తులు
PPM: జిల్లాలో సెకండ్ క్లాస్ స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా జడ్జి ఎం.బబిత మంగళవారం తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవలో ఏదైన పదవిని అలంకరించి లేదా పదవీవిరమణ చేసినా, రాజీనామా చేసినా లా. డిగ్రీ ఉన్నవారు అర్హులని ఆమె పేర్కొన్నారు. కనీసం ఐదేళ్లు న్యాయవాదిగా ప్రాక్టీసు చేసినవారు బార్ జాబితాలో లేనివారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.