రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
అన్నమయ్య: రాయచోటి పట్టణంలోని చిత్తూరు రోడ్డుపై ఎస్‌ఆర్ కళ్యాణ మండపం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ గుర్తుతెలియని యువకుడు మృతి చెందాడు. బైక్‌పై వెళ్తున్న సమయంలో ప్రమాదానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. యువకుడి వివరాలు తెలిస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలన్నారు.