మహిళపై కత్తితో దాడి.. బంగారం చోరీ

ELR: వృద్ధురాలిపై గుర్తు తెలియని అగంతకుడు కత్తితో దాడి చేసి బంగారం నగలను అపహరించుకుపోయిన ఘటన ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్లూరులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. బాధితురాలు సింగంశెట్టి నాగేశ్వరమ్మ స్థానికంగా కిరాణా దుకాణం నిర్వహిస్తూ ఉంటుంది. కూల్ డ్రింక్ కావాలని వచ్చిన అగంతకుడు ఆమెపై విచక్షణ రహితంగా కత్తితో దాడి చేసి బంగారాన్ని దోచేశాడు.