నేడు జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు సమావేశం
కృష్ణా: మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు నేడు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో కొల్లు రవీంద్ర, బుద్ధ ప్రసాద్, బోడె ప్రసాద్, వెంకట్రావు, రాము, కృష్ణప్రసాద్, కుమార్‌రాజా పాల్గొననున్నారు. జిల్లా అభివృద్ధి, నియోజకవర్గాల్లో పెండింగ్ పనులు, ప్రజా సమస్యలపై చర్చించనున్నారు.