VIDEO: పిఠాపురం కౌన్సిల్ సమావేశంలో ఉద్రిక్తత
KKD: పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో బుధవారం ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ స్థలాల కబ్జాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఫ్లోర్ లీడర్ నగేశ్, కౌన్సిలర్ రాయుడు శ్రీను నేలపై కూర్చుని నిరసన తెలిపారు. అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవని, తక్షణమే కబ్జాలను తొలగించాలని వారు డిమాండ్ చేశారు.